English   

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సరికొత్త రికార్డు..

World Famous Lover
2020-09-15 14:21:15

కొన్ని సినిమాలకు కొందరు ప్రేక్షకులకు ఎందుకో తెలియదు గానీ అస్సలు నచ్చవు. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కనీసం 10 కోట్లు వసూలు చెయ్యలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మన ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోయారు. కానీ ఇదే సినిమాను మలయాళ ప్రేక్షకులు మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు. యూట్యూబ్ లో ఈ సినిమా మలయాళం డబ్బింగ్ వర్షన్ రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమాను 20 మిలియన్ల మంది చూశారు.. అంటే 2 కోట్లకు పైగా వ్యూస్ అన్నమాట. తెలుగు డబ్బింగ్ సినిమాలు మలయాళంలో విడుదల చేస్తే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం.

ఇక్కడ విచిత్రం ఏంటంటే మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ సినిమాలు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో వ్యూస్ సాధించలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఎప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. డబ్బింగ్ సినిమాకు మలయాళంలో ఏకంగా 2 కోట్లు వ్యూస్ వస్తాయని నిజంగా వాళ్ళు కూడా ఊహించలేదు. అనుకోకుండా సాధించిన ఈ విషయం చూసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా యూనిట్ పండగ చేసుకుంటుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎలిజబెత్ నటించారు.

More Related Stories