English   

వైయస్ జగన్ పాత్రలో నాగార్జున.. దర్శకుడు ఎవరంటే..

Nagarjuna
2020-09-15 14:49:14

నమ్మడానికి కూడా కాస్త సమయం పట్టేలా ఉంది కదా. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం దీని గురించే చర్చ ఎక్కువగా జరుగుతుంది. నిజంగానే త్వరలో వైఎస్ జగన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నాడు అంటూ  ప్రచారం జరుగుతుంది. జగన్ కు నాగార్జున అత్యంత సన్నిహితుడు కూడా. దాంట్లో ఎం నిజమే అని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఈశ్వర ఏంటంటే గతేడాది ‘యాత్ర’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మహి V రాఘవ ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈయన చెప్పిన కథ సింగిల్ సిట్టింగ్ లోనే నాగార్జున ఓకే చేసినట్లు తెలుస్తుంది. పూర్తిగా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కథ కూడా ఫైనలైజ్ అయిపోయి స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు మహి. 

యాత్ర సినిమా డీల్ చేసిన విధానం చూసి బన్నీ ఈ దర్శకుడికి ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా వైయస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతోందని తెలుస్తుంది. కాకపోతే జగన్ పేరు బయట పెట్టకుండా పొలిటికల్ సినిమాలా దీన్ని తీయాలని దర్శకుడు మహి ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో హీరో క్యారెక్టర్ జగన్ పాత్రను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో ఉన్న హీరో.. ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోతే వచ్చి  సొంతంగా రాజకీయంగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే నాగార్జున కెరీర్ లో తెరకెక్కబోయే తొలి రాజకీయ కథా చిత్రం ఇదే అవుతుంది. మరి చూడాలిక.. నాగ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?  ఇలాంటి సినిమాలు ఊహించనంత ఈజీగా సెట్స్ పైకి రావు. ఒకవేళ వస్తే నిజంగానే అద్భుతం. 

More Related Stories