English   

గంగవ్వను అంతా కలిసి టార్గెట్ చేస్తున్నారా..

 Bigg Boss Telugu 4
2020-09-15 18:23:11

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్కడ మిగిలిన ఇంటి సభ్యులలా గంగవ్వకు రాజకీయాలు చేయడం రాదు. ఉన్నదున్నట్టు కుండబద్దలు కొడుతుంది. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం ఈ మనిషికి రాదు. అందుకే గంగవ్వ చాలా మంది హృదయాలను గెలుచుకుంటుంది. కానీ ఈమెను ఇంటి నుంచి త్వరగా పంపేయాలని ఇంటిలో ఉన్న సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 

తెలియకుండానే గంగవ్వ చుట్టూ ఒక కుట్ర జరుగుతుంది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తొలివారం నామినేషన్స్ లో అందరూ కలిసికట్టుగా నామినేట్ చేశారు. ఇక రెండవ వారం కూడా ఇదే జరిగింది. మీరు నామినేట్ అయినా కూడా జనాలు ఓట్లు వేసి గెలిపిస్తారు.. అందుకే మీరు నామినేట్ అవుతారా అంటూ అవ్వను ఇంటి సభ్యులు అడిగారు.. దాంతో వెంటనే ఒప్పేసుకుంది గంగవ్వ. 

తనకు తానుగా సెల్ఫ్ నామినేషన్ చేసేసుకుంది. ప్రస్తుతం బయట మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండో వారం కూడా సేవ్ అయిపోతుంది. కానీ ప్రతి వారం ఇలాగే గంగవ్వను నామినేట్ చేస్తూ పోతే ఏదో ఒక వారం ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా కాకుండా మిగిలిన సభ్యుల మాదిరి ఈమె కూడా ఆడుకోవడం మొదలు పెడితే పరిస్థితులు మరోలా ఉంటాయని అంటున్నారు అభిమానులు. మరి గంగవ్వ మంచితనం ఎన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో పనికి వస్తుందో చూడాలి. 

More Related Stories