English   

పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన జనసేన..

pawan Kalyan
2020-09-16 12:06:26

ఈ రోజుల్లో అతి మంచితనం కూడా పనికిరాదు అంటారు. పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎవ్వరు ఏమన్నా కూడా తిరిగి మాట్లాడడు.. సమాధానం కూడా ఇవ్వడు.. విమర్శలు పెద్దగా పట్టించుకోడు. అయితే ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో కచ్చితంగా సహనం అనేది నశిస్తుంది. ఖచ్చితంగా కోపం వస్తుంది. పవన్ విషయంలో సోషల్ మీడియాలో కొందరు మరీ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అనే విమర్శ చాలా రోజులుగా ఉంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు కొందరు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అంతర్వేదిలో పవన్ చేసిన పూజను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కొందరు పోస్టులు పెట్టారు. అది అధికార పార్టీ వాళ్ళు చేశారు అంటూ జనసేన ఆరోపిస్తోంది. 

పవన్ చేసిన దేవుడి పూజను క్షుద్ర పూజలుగా చిత్రిస్తూ కొందరు మరీ శృతి మించిపోయారు. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నాడు కానీ ఆయన జనసైనికులు మాత్రం దీనిపై చాలా సీరియస్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా జనసేన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజలింగం ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను కావాలని కొందరు నాశనం చేయడానికి చూస్తున్నారు అంటూ.. ఆయనపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కేసు ఫైల్ చేశారు. ఇక మీదట కూడా పవన్ కళ్యాణ్ ని ఎవరైనా టార్గెట్ చేస్తే  పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. మరి ఇక్కడితో పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం ఆగుతుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories