English   

పాతికేళ్ళ తర్వాత అఖిల్‌కు మళ్లీ అమ్మ అవుతున్న ఆ హీరోయిన్..

 Amani Akhil
2020-09-16 16:40:22

అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఎలాగైనా తొలి విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. దానికి తోడు గీతాఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను నిర్మిస్తుండటంతో కచ్చితంగా ఈ సినిమాతో మాయ చేస్తాడని అఖిల్ అక్కినేని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మధ్యే దీనిపై అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాలో హీరోతో పాటు తల్లి పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ పాత్ర కోసం నిన్నటి తరం హీరోయిన్ ఆమనిని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 

అఖిల్ తొలి సినిమా సిసింద్రీలో ఈమె నటించింది. దాంతో అప్పటి అనుభవాలను ఇప్పుడు గుర్తు చేసుకుంది ఈ సీనియర్ హీరోయిన్. కేవలం ఏడాది వయస్సు ఉన్నప్పుడే  అఖిల్ సిసింద్రీ సినిమాలో నటించాడు. అంత చిన్న వయసులో ఎలా నటించాడా.. ఎలా సినిమా తీసారా అనిపిస్తుంది. అయితే అందులో అఖిల్ కు అమ్మగా నటించిన ఆమనీ ఒక ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పట్లో అఖిల్ మూడ్ ను బట్టి సినిమా తీసేవాళ్లమని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. అఖిల్ హుషారుగా వున్నపుడు సినిమా తీసేవాళ్లమని.. కాస్త ఏడిస్తే ప్యాకప్ చెప్పే వాళ్లమని చెప్పారు ఆమని. ఆ సినిమా ఇప్పటికి తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు ఈమె. ఇన్నేళ్లకు మళ్లీ అఖిల్ కు తల్లిగా నటించబోతున్నానంటూ చెప్పింది ఆమని. సురేందర్ రెడ్డి అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాలో అఖిల్ కు తల్లిగా నటిస్తుంది ఈమె.

More Related Stories