English   

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తొలిభాగం షూటింగ్ మొదలు.. అమ్మ చేతితోనే..

RGV
2020-09-16 16:46:13

ఇంతకంటే వెరైటీ మరోటి ఉండదు. తనపై వాడు వీడు సినిమాలు చేయడం ఏంటి.. తనే చేసుకుంటాను అంటున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు తనపై తాను సెటైర్ వేసుకోడానికి కూడా వెనకాడడు వర్మ. పక్క వాన్ని తిట్టాలంటే ముందు తనను తాను తిట్టుకుంటాడు. అప్పట్లో వచ్చిన అప్పల్రాజు సినిమాలో కూడా ఇదే చేసాడు ఆర్జీవీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పటికే వర్మపై పరాన్న జీవితో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన బయోపిక్ తానే నిర్మించడానికి ముందుకొచ్చాడు ఆర్జీవీ. బొమ్మాకు మురళి నిర్మాణంలో  RGV పర్యవేక్షణలో   దొరసాయి తేజ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో  దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్  రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

ఒక్కో పార్టు రెండు గంటల నిడివితో మొత్తం మూడు భాగాలుగా రానుంది వర్మ బయోపిక్. వివిధ దశల్లోని మొదటి రెండు భాగాల్లో రాము క్యారెక్టర్‌ను ఇతర నటులు పోషించనుండగా.. కీలకమైన మూడో భాగంలో స్వయంగా రామ్ గోపాల్ వర్మ నటించనున్నాడు. మొత్తానికి తన బయోపిక్‌నే తానే నిర్మిస్తూ నటిస్తూ సంచలనాలకు తెర తీస్తున్నాడు ఆర్జీవీ. ఇంతకంటే వెరైటీ మరోటి ఉండదు. తనపై వాడు వీడు సినిమాలు చేయడం ఏంటి.. తనే చేసుకుంటాను అంటున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు తనపై తాను సెటైర్ వేసుకోడానికి కూడా వెనకాడడు వర్మ. పక్క వాన్ని తిట్టాలంటే ముందు తనను తాను తిట్టుకుంటాడు. అప్పట్లో వచ్చిన అప్పల్రాజు సినిమాలో కూడా ఇదే చేసాడు ఆర్జీవీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పటికే వర్మపై పరాన్న జీవితో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన బయోపిక్ తానే నిర్మించడానికి ముందుకొచ్చాడు ఆర్జీవీ. బొమ్మాకు మురళి నిర్మాణంలో  RGV పర్యవేక్షణలో   దొరసాయి తేజ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌ 16న మొదలు పెట్టి 15 రోజులు కంటిన్యూగా చేయనున్నారు. 

More Related Stories