English   

పూజా హెగ్డే అన్నంత పని చేసిందిగా.. మిగిలిన వాళ్లకు షాక్..

Pooja Hegde
2020-09-17 18:17:35

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే నెంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డేనే అవుతుంది. వరస విజయాలతో పాటు క్రేజ్ కూడా ఈ అమ్మడికి అలాగే ఉంది. మొదట్లో కాస్త కెరీర్ డల్ గా ఉన్నా కూడా డిజే తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. పైగా బికిని వేయడానికి కూడా నో చెప్పదు.. అందాల ఆరబోతకు అస్సలు మొహమాటపడదు. దాంతో ఈమె కావాలంటున్నారు హీరోలు.. దర్శక నిర్మాతలు కూడా. ఇప్పుడు అఖిల్, ప్రభాస్ లాంటి హీరోలతో రొమాన్స్ చేస్తుంది పూజా. అయితే కరోనా కారణంగా ఆర్నెళ్లుగా షూటింగ్స్ ఏం జరగడం లేదు. కానీ ఇప్పుడు అందరికంటే ముందు ఈ భామ సెట్ కు వచ్చేసింది.

తనకు షూటింగ్ కు రావడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని.. దర్శక నిర్మాతలు అడిగితే షూటింగ్ కు వస్తానని ఈ మధ్యే అనౌన్స్ చేసింది పూజా. ఇప్పుడు అన్నంత పని చేసింది. అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ కు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటికి వచ్చింది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ కూడా షూటింగ్ కు రానున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. త్వరలోనే సినిమా విడుదల కానుంది. 

More Related Stories