English   

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Sri Reddy
2020-09-17 17:20:06

లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది అన్నట్లు.. శ్రీ రెడ్డి ఎక్కడ ఉంటే కాంట్రవర్సీ అక్కడ ఉంటుంది. లేకపోయినా కూడా కచ్చితంగా ఆమె కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది శ్రీ రెడ్డి. కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళనాట సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా టాలీవుడ్లో డ్రగ్స్ కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఎవరు నీతిమంతులు లేరని అందరూ డ్రగ్స్ బానిసలే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఈమె. తనకు రక్షణ కల్పిస్తే తెలుగు ఇండస్ట్రీ లో ఎవరెవరు మత్తులో మునిగి తేలుతున్నారు అనే విషయం మీడియాకు చెబుతాను అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

తెలుగులో ఎవరు తీసుకుంటారు అనేది పేర్లతో సహా తనకు తెలుసు అంటుంది శ్రీ రెడ్డి. ఇక్కడ పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని.. వీకెండ్స్ లో రేవ్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళ పేర్లు బయట పెడితే ఖచ్చితంగా తనను చంపేస్తారంటుంది శ్రీ రెడ్డి. రెండేళ్ల కిందట టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ సంచలనం సృష్టించింది. పూరి జగన్నాథ్, రవితేజ సహా చాలా మంది పేర్లు ఇందులో ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని రోజుల పాటు నార్కోటిక్స్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు శ్రీ రెడ్డి డ్రగ్స్ గురించి బయటకు తీసింది. తనకు రక్షణ కల్పిస్తే అసలు నిజాలు బయట పెడతాను అంటుంది. మరి ఈమె చెప్పే నిజాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. 

More Related Stories