English   

బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..

Karate Kalyani
2020-09-18 08:33:39

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై అప్పుడే 12 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే తొలి వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అయిపోయాడు. దాంతో రెండో వారం ఎవరు బయటికి వెళ్లి పోతారు అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ వారం 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో కొందరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అభిజిత్, అమ్మ రాజశేఖర్, మొనాల్ గజ్జర్, నోయల్, దేత్తడి హారిక, గంగవ్వ లాంటి వాళ్ళు ఈజీ గా సేవ్ అయిపోతారు. అయితే కొందరు మాత్రం డేంజర్ జోన్ లో ఉండిపోయారు. వాళ్లకు బయట కూడా పెద్దగా సపోర్ట్ లేదు. అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్లలో సీనియర్ నటి కరాటే కళ్యాణితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఉన్నారు.

మిగిలిన వేళ్ళతో పోల్చుకుంటే ఈ ఇద్దరికీ బయట సపోర్ట్ తక్కువగా ఉంది. అన్నింటికీ మించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కుమార్ సాయి ఈ వారం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. దాంతో అందరికంటే ఎక్కువగా డేంజర్ జోన్ లో ఉన్నది కరాటే కళ్యాణి. ఈ వారం ఇంటి నుంచి బయటికి వచ్చే సభ్యులలో కళ్యాణి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. హౌస్ లో ఆమె బాగానే ఉన్నా కూడా బయట సోషల్ మీడియా సపోర్ట్ లేకపోవడం కరాటే కళ్యాణికి శాపంగా మారింది. ఇప్పటివరకు చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ లో అభిజిత్, గంగవ్వ లాంటి వాళ్ళు దూసుకుపోతున్నారు. మరి ఇక చూడాలి ఈ వారం పరిస్థితి ఎలా ఉండబోతుందో.

More Related Stories