English   

మెహర్ రమేష్ సుడి తిరిగింది.. చిరంజీవి సింగిల్ సిట్టింగ్ లో ఓకే..

 Chiranjeevi
2020-09-18 12:56:40

తెలుగు ఇండస్ట్రీలో మెహర్ రమేష్ పేరు వింటే చాలు అందరూ భయపడతారు. దీనికి కారణం ఆయన చేసిన సినిమాలు. దర్శకుడిగా ఆయన చేసిన నాలుగు సినిమాలు కూడా అత్యంత తీవ్రంగా నిరాశ పరిచాయి. నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు అయితే మెహర్ రమేష్ పేరు చెప్తే మండి పడతారు. అంత దారుణమైన ట్రాక్ రికార్డు ఈ దర్శకుడి సొంతం. షాడో సినిమా వచ్చి ఏడేళ్ళవుతున్నా కూడా ఇప్పటి వరకు మరో అవకాశం ఇవ్వలేదు. ఈయనకు కూడా దర్శకత్వం చేయాలనే ఆశలేదు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ కు అదిరిపోయే అవకాశం వచ్చింది. అది కూడా అలాంటిలాంటి ఆఫర్ కాదు.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం. ఎంతోమంది దర్శకుడు కలలు కంటుంటారు చిరంజీవితో సినిమా చేయడానికి. అలాంటి మెగాస్టార్ మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చాడు. 

చాలా రోజుల నుంచి ఈ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నా కూడా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు అవసరం లేదు. త్వరలోనే మెహర్ రమేష్ సినిమా మొదలు కానుంది. తమిళ్ సూపర్ హిట్ అయినా అజిత్ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యత మెహర్ రమేష్ కు అప్పగించాడు చిరంజీవి. తాజాగా చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లు మెహర్ రమేష్ స్క్రిప్టులో చేసిన మార్పులు మెగాస్టార్ కు బాగా నచ్చాయని తెలుస్తుంది. సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమా కథను ఓకే చేశారు మెగాస్టార్. దాంతో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆచార్య పూర్తయిన తర్వాత లూసిఫర్ రీమేక్ అనుకున్నారు కానీ దానికంటే ముందు మెహర్ రమేష్ సినిమా మొదలు కానుంది. మరి చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని మెహర్ ఎంతవరకు వాడుకుంటాడు చూడాలి. 

More Related Stories