English   

హనీమూన్ అక్కడ ప్లాన్ చేసిన రానా దగ్గుబాటి..

Rana Daggubati
2020-09-22 14:21:37

లాక్ డౌన్ సమయంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నాడు రానా దగ్గుబాటి. ఉన్నంతలో సన్నిహితులను పిలుచుకొని చాలా గ్రాండ్ గా వాళ్ళ మధ్యలో ఏడు అడుగులు వేశాడు దగ్గుబాటి వారసుడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లుగా మిహీక బజాజ్ తో ప్రేమలో ఉన్న రానా చివరికి ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మొన్నటి వరకు పెళ్లి తర్వాత పనులతో బిజీగా ఉన్నాడు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఇంట్లోనే కాలం గడిపేసాడు రానా. ఇప్పుడు తన హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో. కోరుకున్న ప్రేయసిని భార్యగా చేసుకుని హనీమూన్ కి వెళ్ళిపోయాడు రానా దగ్గుబాటి. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటితే చాలా ప్రమాదం కాబట్టి ఇండియాలోనే తన హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు. ఎంతోమందికి డెస్టినీ ప్లేస్ గా ఉండే గోవాను తన హనీమూన్ కోసం ఎంచుకున్నాడు రానా. అక్కడే తన భార్యతో కలిసి గత రెండు రోజులుగా ఎంజాయ్ చేస్తున్నాడు. హనీమూన్ ఎంజాయ్ చేస్తూ కూడా మళ్లీ ప్రొఫెషనల్ పనులు కూడా చేసుకుంటున్నాడు రానా. యానిమేషన్ కంపెనీ మొదలుపెట్టి అందులో ఎపిసోడ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి గోవా నుంచి తన టీంకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. తను వచ్చే లోపు అన్ని పనులు పూర్తి చేయాలని సూచించాడు. మొత్తానికి ఒక వైపు హనీమూన్ మరోవైపు కెరీర్ పనులు కూడా చూసుకుంటున్నాడు ఈయన. 

More Related Stories