English   

నా డాన్సులో చాలా తప్పులు ఉంటాయి.. బన్నీ సెన్సేషనల్ కామెంట్..

Allu Arjun
2020-09-23 08:47:46

తెలుగు ఇండస్ట్రీ లో బెస్ట్ డాన్సర్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం ముందు చిరంజీవి అని వినిపిస్తుంది. అయితే ఆయన తర్వాత ఎవరూ అనే ప్రశ్నకు చాలా మంది పేర్లు వస్తాయి. అందులో ఎక్కువ ఉంది అల్లు అర్జున్ పేరు చెబుతుంటారు. ఎందుకో తెలియదు కానీ బన్నీ డాన్స్ చేస్తుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది అంటూ చిరంజీవి కూడా చెప్పాడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలో సినిమాలోనే బన్నీ అద్భుతమైన డాన్సర్లలో ఒకడిగా నిలిచాడు. ప్రతి సినిమాలోనూ కష్టతరమైన స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఇంత అద్భుతంగా డాన్స్ చేసే బన్నీకి అప్పుడప్పుడు తన స్టెప్పులలో తప్పులు కనిపిస్తున్నాయని చెప్పాడు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా బన్నీ ఇదే చెబుతున్నాడు. 

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను మంచి డాన్సర్‌నని అందరూ అంటూ ఉంటారు.. కానీ నేను చేసిన డాన్స్ లలో నాకు తప్పులు కనిపిస్తుంటాయి.. ఆ సంగతి ఎవరికీ తెలీదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాట చూసుకునేటప్పుడు తనకు సంతృప్తి కలగదని చెప్పాడు. ఈ పాటకు ఇంతకంటే మంచి స్టెప్స్ వేయొచ్చు అనిపిస్తోందని.. ఓ పట్టాన ఒప్పుకోదు అంటున్నాడు ఈయన. అయినా ఈ రోజుల్లో డాన్స్ అనేది పెద్ద యుఎస్పీ (అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్‌) కాదని తన అభిప్రాయం అంటున్నాడు బన్నీ. ఇండస్ట్రీలో తన డాన్స్ పోటీ ఎవరు అంటే ఎవరూ లేరని తనకు తానే పోటీ అంటూ సంచలన సమాధానం చెప్పాడు అల్లు అర్జున్ ఒకప్పుడు డాన్సులు కొత్త కానీ.. ఇప్పుడు వచ్చిన హీరోలంతా డాన్స్ లు బాగా చేస్తున్నారు అంటున్నాడు అల్లు అర్జున్. తారక్‌, చరణ్‌, రామ్‌, నితిన్ బాగా డాన్స్ చేస్తారని.. ఇదివరకు నలుగురు హీరోలే ఉండేవాళ్లని.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్నాడు. నేనొక్కడినే డాన్స్ చేస్తాను అని చెప్పుకొనే పరిస్థితి లేదంటున్నాడు.. కాకపోతే తాను డాన్సులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటా కాబట్టి తన డాన్సుల్లో ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంటుందని తెలిపాడు బన్నీ.
 

More Related Stories