English   

మర్యాద రామన్న నటుడు కన్నుమూత.. కరోనాతో పోరాడుతూ మృత్యు ఒడిలోకి..

Kosuri Venugopal
2020-09-23 23:03:02

కరోనా చాలా మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో చనిపోయాడు. ఇప్పటికే టాలీవుడ్‌లో నిర్మాత పోకూరి రామారావుతో సహా మరో నిర్మాత కూడా కన్నుమూసాడు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో ప్రాణాలు వదిలాడు. ఆయన పేరు కోసూరి వేణుగోపాల్. పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా ఫేస్ చూస్తే ఈయనా అంటారు. రాజమౌళి సినిమాల్లో ఈయన ఎక్కువగా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో నటించిన నటుడు గుర్తున్నాడు కదా.. ఆయనే వేణుగోపాల్ అంటే. దాంతో పాటు విక్రమార్కుడు లాంటి సినిమాల్లో కూడా నటించాడు వేణుగోపాల్. తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. వేణుగోపాల్ మరణంతో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories