English   

సల్మాన్ ఖాన్ హీరోయిన్ తో జోడీ కడుతున్న అడవి శేష్..

Saiee Manjrekar
2020-09-25 10:01:16

కొందరు హీరోయిన్లకు బాలీవుడ్ డ్రీమ్ డెబ్యు దొరుకుతుంది.. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం వారు పూర్తిగా విఫలం అవుతుంటారు. అందులో సాయి మంజ్రేకర్ కూడా ఉంది. దర్శక నిర్మాత, నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు ఈమె. గతేడాది సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ 3 సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది సాయి మంజ్రేకర్. ఇందులో సోనాక్షి సిన్హా కూడా ఉంది. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించిన గుర్తింపు మాత్రం వచ్చింది. అయినా కూడా మంజ్రేకర్ కూతురుని ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో ఆమె పక్కన ఇండస్ట్రీలు వెతుక్కుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే తెలుగులో ఓ మంచి అవకాశం దక్కించుకుంది సాయి మంజ్రేకర్. 

అడవి శేష్ హీరోగా శశి టిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో శోభితా ధూళిపాళ కూడా నటిస్తోంది. గూఢచారి సినిమా తర్వాత మరోసారి అడవి శేష్ శోభితా కలిసి నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ ను ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. ఇందులో ఈయన కూడా భాగస్వామి. వచ్చే ఏడాది మేజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేష్ మేజర్ తో మరోసారి సంచలనం సృష్టిస్తాడని నమ్ముతున్నారు ఆయన అభిమానులు. 

More Related Stories