English   

హీరోయిన్ డ్రగ్స్ తీసుకుంటే.. హీరోలు చాక్లెట్లు తింటున్నారా..

drug case
2020-09-25 10:27:02

ఇప్పుడు అందరిలో వస్తున్న కామన్ డౌట్స్ ఇవే. కొన్ని రోజులుగా డ్రగ్స్ కుంభకోణం అన్ని ఇండస్ట్రీలను ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీ ఇందులో కూరుకుపోయింది. రెండేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా మత్తులో ఊగిపోతుంది అంటూ నార్కోటిక్స్ అధికారులు నానా హంగామా చేశారు. పూరి జగన్నాథ్, రవితేజ లాంటి పెద్ద పెద్ద వాళ్లను కూడా పిలిచి విచారించారు. ఆ తరువాత ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత డాగ్స్ వ్యవహారం బయటికి వచ్చింది. ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత చివరికి ఇది డ్రగ్ మాఫియా దగ్గర ఆగింది. అందులో కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లకు సమన్లు కూడా జారీ చేశారు నార్కోటిక్స్ అధికారులు.

అందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండటం గమనార్హం. మరో వైపు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు ఇందులో వినిపించింది. ఇదిలా ఉంటే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి కూడా డ్రగ్స్ కుంభకోణంలో ఉన్నారు. అయితే ఇక్కడే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం హీరోయిన్ల పేర్లు బయటకు రావడం ఏంటి.. హీరోలు మత్తు తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటుంటే హీరోలు ఏమైనా చాక్లెట్లు తింటున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కేవలం హీరోయిన్లను మధ్యలో ఇరికించి పెద్ద తలకాయలు తప్పించుకుంటున్నారు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదైనా కూడా ఈ డ్రగ్స్ కేసులో కేవలం ముద్దుగుమ్మల పేర్లు మాత్రమే బయటకు రావడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 

More Related Stories