English   

బిగ్ బాస్ హౌజ్ లో ఆ ఓవరాక్షన్ ఏంట్రా నాయనా..

Bigg Boss Telugu 4
2020-09-25 10:35:59

బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల ముఖ చిత్రం కూడా ఇదే. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. అక్కడ ఒకొక్కరు చేస్తున్న ఓవరాక్షన్ చూసి రామ రామ అనుకుంటున్నారు ఆడియన్స్. ఎవడు వీడు రూపాయికి పది రూపాయల యాక్షన్ చేస్తున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను వాళ్ళు మామూలుగా ఆడుకోవడం లేదు. మరీ ముఖ్యంగా లేటెస్ట్ ఎపిసోడ్ లో సోహైల్, మెహబూబ్, మోనాల్ చేసిన ఓవరాక్షన్ చూసి వామ్మో ఏంటిది అనుకున్నారు. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా లేదంటే చాపల మార్కెట్ అనుకుంటున్నారా అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మనుషులు రోబోల టాస్క్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడారు. మరీ ముఖ్యంగా అభిజిత్ గేమ్ ప్లాన్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

కానీ దాన్ని అవతలి టీం తీసుకోవడంలో కాస్త తడబడింది. దాంతో రెండిటికి పెద్ద గొడవ జరిగింది. ఏదైనా కూడా బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకు రచ్చ పెరిగిపోతుంది. ఇది చూసిన తర్వాత ఈ ఓవరాక్షన్ భరించడం మా వాళ్ళ కాదు బాబోయ్ అంటూ ఆడియన్స్ కూడా అప్పుడప్పుడు పెదవి విరుస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నామ్ కాస్త కంట్రోల్ లో ఉండండి రా నాయనా అంటూ వాళ్లకు సూచిస్తున్నారు. మరి ఈ సలహాలు సూచనలు హౌస్ మేట్స్ వరకు మా టీవీ తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటివరకైతే బిగ్బాస్ ఓటింగ్ కు, రేటింగ్ కు వచ్చిన ప్రమాదమేమీ లేదు. కానీ ఇంత ఓవరాక్షన్ చేస్తే ఫ్యూచర్ దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు.

More Related Stories