English   

రామ్ గోపాల్ వర్మ దిశ ఎన్ కౌంటర్ ట్రైలర్..

Disha Encounter
2020-09-26 12:42:47

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం సంచలనం సృష్టించింది దిశ రేప్ అండ్ మర్డర్ కేసు. ఒక డాక్టర్ను నలుగురు కిరాతకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘటన కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇది జరిగిన పది రోజుల్లోనే నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. దాంతో అందరి మీద ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ దిశ ఎన్కౌంటర్ అనే సినిమా చేస్తున్నారు. ఆయన శిష్యులు ఆనంద్ చంద్ర దీనికి దర్శకుడు. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కేవలం ఎలా జరిగింది అనేది మాత్రం నిందితులు చెప్పిన దాన్ని బట్టి అందరికీ తెలిసింది. దానికి ఇప్పుడు చిత్ర రూపం ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. రెండు నిముషాల 45 సెకండ్ ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంది. ఒక అమ్మాయి స్కూటీ ఆపడం.. నలుగురు కుర్రాళ్లు చూడటం.. ఆ తర్వాత ఆమెను లారీలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపేయడం.. అక్కడి వరకు చూపించాడు వర్మ. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రపంచానికి తెలుసు. దాన్ని సినిమాలో చూపించాలని దాచేశాడు ఈ దర్శకుడు. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 

More Related Stories