English   

అశ్రునయనాల మధ్య ముగిసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు..

S P Balasubrahmanyam
2020-09-26 13:09:22

లెజెండ్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిసాయి. పూర్తి బందోబస్తు మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని తామరై పాక్కం దగ్గర ఉన్న ఆయన 14 ఎకరాల ఫామ్హౌస్లో ఎస్పీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తిచేశారు కుటుంబ సభ్యులు. వేలాది మంది అభిమానులు ఆయనను చూడడానికి తరలివచ్చారు. కుటుంబసభ్యులు సన్నిహితులు మౌనంగా రోదిస్తూ ఉంటే బాలు అలాగే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో గత 45 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం ఒంటిగంటకు స్వర్గస్తులయ్యారు. ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కోడంబాకం లోని ఎస్పీ చరణ్ ఇంటికి తీసుకొచ్చారు. 

నిజానికి ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే ఉంచి సెప్టెంబర్ 26 ఉదయం అంతిమ యాత్ర మొదలు పెట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో వేలాది మంది అభిమానులు ఆయనను చూడటానికి ఇంటికి వచ్చారు. దాంతో ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇంటి దగ్గర కాకుండా ఫామ్హౌస్కు త్వరగా భౌతికకాయాన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో వాళ్లు కూడా సెప్టెంబర్ 22 రాత్రి బాలు భౌతికకాయాన్ని ఇక్కడికి తీసుకు వచ్చారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆయన అంత్యక్రియలు మొదలయ్యాయి. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రారాజు అలా నిర్జీవంగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరయ్యారు అభిమానులు.

More Related Stories