English   

ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేది ఎవరు...

Bigg Boss 4
2020-09-26 17:54:26

చూస్తుండగానే బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలైన మూడు వారాలు అవుతుంది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి నామినేషన్స్ లో ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. మెహబూబ్, లాస్య, మోనాల్, అరియనా, హారిక, దేవి నాగవల్లి, కుమార్ సాయి ఉన్నారు. వీళ్లలో ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారు అనేది ఈ ఆదివారం తెలుస్తుంది. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రచారం చూస్తుంటే యూట్యూబ్ స్టార్ మెహబూబ్, కమెడియన్ కుమార్ సాయిలలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మెహబూబ్ కి బయట సోషల్ మీడియాలో అంతగా ఫాలోయింగ్ లేదు.. మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఇమేజ్ కూడా తక్కువ.. అయితే హౌస్ లో చాలా జెన్యూన్ గా కనిపిస్తున్నాడు మెహబూబ్. టాస్కులు జరిగినప్పుడు కూడా ప్రాణం పెడుతున్నారు.. కానీ ఏం లాభం ఇంట్లో సపోర్ట్ లేదు.. బయట కూడా పెద్దగా గుర్తింపు లేదు. మరోవైపు కుమార్ సాయి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈయన కూడా ఇంట్లో చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు. హౌస్ మేట్స్ తో కూడా ఎక్కువగా కలవడం లేదు. ఖచ్చితంగా ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన వాళ్ళు అందరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. దేవి నాగవల్లికి టీవీ9 సపోర్ట్ ఉంటది.. మోనాల్, అరియనాకు పర్లేదు.. లాస్య సేఫే.. ఎలా చూసుకున్నా కూడా ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో. 

More Related Stories