డ్రగ్స్ కేసు...రకుల్ కు సినిమా ఛాన్సులు వస్తాయా...

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో చిత్రపరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సుశాంత్ కు అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డ్రగ్స్ అలవాటు చేసిందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేయడంతో ఈడీ అధికారులు డ్రగ్స్ కోణంలో విచారణ జరిపారు. కాగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ గెస్ట్ హౌస్ జరిగిన అనేక పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించడంతో పాటు రియా పరిశ్రమలోని ఇతరులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు వెల్లడైంది. దాంతో ఈ కేసును ఎన్సీబి (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులు విచారిస్తున్నారు.
రియా కాంటాక్ట్ లో దీపికా పదుకొనే, సారా అలీఖాన్ తో పాటూ టాలీవుడ్ భామ రకుల్ పేర్లు ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఎన్సీబి అధికారులు ఈ ముగురు విచారణకు హాజటు కావాలంటూ సమన్లు జారీ చేశారు. దాంతో రియాతో కలిసి రకుల్ ముంబై లోని ఎన్సీబి కార్యాలయంలో విచారణకు హాజరైంది. విచారణలో రకుల్ సంచలన విషయాలు భయట పెట్టింది తాను రియాతో డ్రగ్స్ గురించి సంభాషించింది నిజమేనని..కానీ డ్రగ్స్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
ఇక ఇదిలా ఉండగా డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడంతో రకుల్ కు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కుతాయా అన్న ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు ఇవ్వాలంటే దర్శకులు నటన, అందంతో పాటు డిసిప్లేన్ కూడా ముఖ్యంగా చూస్తారని తెలుస్తోంది.