నేషనల్ మీడియాకు డైరెక్టర్ హరీష్ శంకర్ చురకలు

టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ నేషనల్ మీడియాపై వ్యంగ్యంగా ఫైర్ అయ్యారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. బాలు మృతితో యావత్ సినీలోకం విషాదంతో నిండిపోయింది. బాలు అంత్యక్రియలు నేడు చెన్నై లో జరగగా సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాకుండా పలువురు బాలీవుడ్,ఇతర పరిశ్రమల నటులు సోషల్ మీడియాలో బాలు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా గాన గాంధర్వుడి మృతి పై ఇంటర్ నేషనల్ మీడియా సైతం కథనాలను ప్రసారం చేసింది. అయితే మన నేషనల్ మీడియా మాత్రం పెద్దగా టెలికాస్ట్ చెయ్యలేదు. దాంతో ఇంటర్నేషనల్ మీడియాలో బాలు మృతిపై వచ్చిన కథనాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి నేషనల్ మీడియాకు చురకలు అంటించారు. "ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..అయితే మరి కొందరి స్థాయి సందుల్లో పరిమితం" అంటూ ఘాటుగానే ట్వీట్ చేశారు.