English   

బాయ్ ఫ్రెండ్ బర్త్ డే కు భారీగా ఖర్చు చేసిన నయన్

 Nayanthara
2020-09-27 11:27:11

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయన్ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇటీవల నయన్ తన ప్రియుడు విగ్నేష్ శివన్ పుట్టినరోజును భారీగా ఖర్చు చేసిందని టాక్ వినిపిస్తోంది. విగ్నేష్ తో కలిసి కొన్ని రోజులు జాలిగా గడపడానికి నయన్ ఇటీవల గోవా వెళ్ళింది. అక్కడే విగ్నేష్ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను నయన్ తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి ఈ హాట్ బ్యూటీ ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసిందట. కేవలం మూడు రోజుల పర్యటన కోసం నయన్ 25 లక్షలు ఖర్చు  చేయడంతో ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇక ఇప్పటికే పలువురితో నయన్ ప్రేమాయణం పెళ్లి వరకూ వచ్చి ఆగిపోవడంతో విగ్నేష్ శివన్ తో అయినా కొనసాగుతుందా అని టాక్ నడుస్తోంది.

More Related Stories