English   

బిగ్ బాస్ హౌస్ లోకి అనుష్క

Anushka
2020-09-27 11:32:37

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-4 సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షో మూడు వారాలు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఒక్కో వారంలో ఒక్కో వైల్డ్ కార్డు ఎంట్రీ తో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో స్వీటీ అనుష్క సందడి చేయబోతుందని తెలుస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2న ఓటిటీ ప్లాట్ ఫామ్ పై అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. కాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుష్క బిగ్ బాస్  హౌస్ లో సందడి చేయనుందని గుసగుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆదివారం నాగార్జున వచ్చే సందర్బంలో అనుష్క షో కి వస్తుందని టాక్ నడుస్తోంది. ఇక అనుష్క రావడం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

More Related Stories