English   

డ్రగ్స్ గ్యాంగ్ ను వదిలిపెట్టను.. మద్దాలి శివా రెడ్డి

MP Ravi Kishan
2020-09-27 11:43:26

బాలీవుడ్ లో డ్రగ్స్ దందా పై సినీనటుడు, ఎంపీ రవికిషన్ స్పందించారు. ఆయన తెలుగులో అల్లు అర్జున్ కి విలన్ గా మద్దాలి శివారెడ్డి అనే పాత్రలో నటించి తెలుగు ఇండస్ర్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కాగా రవి కిషన్ పరిశ్రమలో డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు భయట పెట్టారు. బాలీవుడ్ లో డ్రగ్స్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను రెండు మూడు ప్రాజెక్ట్ ల నుండి తొలగించారని వెల్లడించారు. రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ నుండి తాను తొలగించబడ్డానని అన్నారు. ఎంతమంది వ్యతిరేకించిన కూడా సినీపరిశ్రమ మంచికోసమే తాను మాట్లాడతానని అన్నారు. 

నటుడిగా మంచి కీర్తి సంపాదించడానికి మాత్రమే సభకు వెళ్లలేదని..ప్రజల గొంతు సభలో వినిపించడానికి వెళ్లానని చెప్పారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన రవి కిషన్ ముఖ్యమంత్రి యోగిని కలిసిన తరవాత మీడియాతో మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు. డ్రగ్స్ దందాలో మాస్టర్ మైండ్ ఎవరు? ఎక్కడుంటారు.? వారికి ఎవరు ఫైనాన్స్ చేస్తారు.? అన్ని విషయాలు భయటకు రావాలని అన్నారు. గ్యాంగ్ సభ్యలందర్నీ అదుపులోకి తీసుకుని విచారించాలని అన్నారు. సభలో తాను మాట్లాడిన విధానాన్ని యోగి అదిత్యనాథ్ మెచ్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. యోగి తనలో మరింత ధైర్యం నింపారని అన్నారు. డ్రగ్స్ ముఠాపై తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రవి కిషన్ బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించారు. ప్రస్తుతం ఆయాన రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నారు.

More Related Stories