బాలు జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలి...సీఎం జగన్ కు బాబు లేఖ...

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా తో ఆస్పత్రిలో చేరగా ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించిన సంగతి తెలిసిందే. బాలు మరణం దేశంలోని సంగీత ప్రియులందరిని కలవరపరిచింది. వివిధ సినీ పరిశ్రమల నుండి ప్రముఖులు బాలు కు నివాళులు అర్పించారు. ఆయన మన తెలుగు వారు కావడం నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడం తెలుగు రాష్ట్రాలు గర్వించదగిన విషయం కూడా.
అయతే బాలు గారి స్మారకార్థం కొన్ని కార్యక్రమాలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు ఓ లేఖ రాశారు. లేఖలో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ సంగీత ఆకాడమికి బాలు గారి పేరు పెట్టాలన్నారు. అంతే కాకుండా బాలు గారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ఆయన కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో సంగీత ఆకాడమిని ఏర్పాటు చేయడంతో ఆయనకు సరైన నివాళ్ళు అర్పించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు.
బాలు గారి స్మారకార్థం జాతీయ స్థాయిలో సంగీతంలో అవార్డులు జారీ చేయాలన్నారు. ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహించి 10లక్షల రూపాయలు అవార్డు ప్రధానం చేయాలని పేర్కొన్నారు.