English   

డ్రగ్స్ కేసు..రకుల్ అరెస్ట్ తప్పదా..

Rakul Preet Singh
2020-09-28 12:40:35

చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రక్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా డ్రగ్స్ కోణం భయట పడటంతో అధికారులు మొదట రియా చక్రవర్తికి అరెస్ట్ చేయగా ఆమె దీపికా, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ ల పేర్లను భయట పెట్టింది. దాంతో అధికారులు వీరికి సమన్లు జారీ చేసి ఒకొక్కరిని విచారించారు. అయితే విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ తాను డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి తో  చాటింగ్ చేశానని కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొంది. అయితే సంభాషణలో డ్రగ్స్ పై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఒక ప్రముఖ న్యాయవాది స్పందించారు.

రకుల్ డ్రగ్స్ విషయంపై చాటింగ్ చేసినా అరెస్ట్ అవ్వడం కాయమని అంటున్నారు. ఎన్డిపిఎస్ చట్టం(8) ప్రకారంగా డ్రగ్స్ గురించి దాచడం కూడా పెద్ద నేరమని స్పష్టం చేశారు. రకుల్ విచారణలో నిజంగా ఒప్పుకున్నట్లయితే ఆమె అరెస్ట్ తప్పదని వెల్లడించారు. డ్రగ్స్ వాడటం కంటే దాచడం ఇంకా పెద్ద నేరమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా రియా చక్రవర్తి తో స్నేహమే రకుల్ కొంపముంచిదని సినీపరిశ్రమ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటున్నాయి. అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ముంబై వెళ్ళినప్పుడల్లా రియంతో కలిసి బార్లకు, పబ్బులకు తెగ తిరిగేదని ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు రకుల్ రియాతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక న్యాయవాది చెప్పినట్టు రకుల్ ని అధికారులు అరెస్ట్ చేస్తారా..లేదా? చూడాలి.

More Related Stories