English   

కరోనాను ఇలా జయించాను..నాగబాబు

Naga Babu
2020-09-28 13:13:42

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సినీతారలు సైతం కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కొలుకున్నారు కూడా. ఇక ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తాజాగా నాగబాబు కరోనా ను జయించినట్టు పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఆయన ఎదురుకొన్న అనుభవాలను, తీసుకున్న జాగ్రత్తలను మీడియాకు వెల్లడించారు. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కూడా ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు ప్రకటించారు. అయితే అప్పుడు నెగిటివ్ రాగా ఇటీవల చాలిజ్వరం రావడంతో మరో సారి టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. రిపోర్ట్స్ లో పాజిటివ్ రావడం వచ్చిందన్నారు.

గతంలో తనకు న్యుమోనియా రావడంతో డాక్టర్ల సలహమేరకు ఆస్పత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. ఐదురోజులపాటు తనకు రేమిడిసివిర్ ఔషదాన్ని ఇచ్చారని అన్నారు. కరోనా కు ఎవ్వరూ అతిథులు కారని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుందని పేర్కొన్నారు. కరోనా కు మందు లేదని వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని తెలిపారు. దగ్గు, జ్వరం ఉంటే వెంటనే చికిత్స చేసుకోవాలని సూచించారు. 14 రోజుల తరువాత వైరస్ దానికదే చనిపోతుందని తెలిపారు. 14 రోజుల తరువాత ఒకవేళ వైరస్ ఉన్నా అది మనకు హాని కలిగించిందని అన్నారు. ప్లాస్మా దానం చెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

More Related Stories