English   

సిగరెట్లు తాగాను..సుశాంత్ తో డేటింగ్ చేసాను కానీ :సారా అలీఖాన్

Sara Ali Khan.jpg
2020-09-29 04:29:46

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం భయటపడటంతో అధికారులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో అధికారులు రియాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రియా పలువురు తారల పేర్లు భయటపెట్టింది. రియా విచారణలో వెల్లడించిన పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకునే, శ్రద్దా కపూర్ పేర్లు ఉన్నాయి. దాంతో అధికారులు ఒకొక్కరిని విచాటించారు.

ఈ నేపథ్యంలో సారా అలీఖాన్ సెప్టెంబర్ 26న విచారణకు హాజరైంది. కాగా నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో సారా కీలక విషయాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా ప్రచురించింది. సారా అలీఖాన్ విచారణలో సుశాంత్ తో కలిసి డేటింగ్ చేసినట్టు ఒప్పుకుందని తెలుస్తోంది. అంతే కాకుండా సుశాంత్ గెస్ట్ హౌస్ జరిగిన పార్టీలకు తను వెళ్ళేదానినని సారా పేర్కొంది. అయితే పార్టీలకు వెళ్ళినప్పుడు సిగరెట్ మాత్రం తీసుకున్నానని కానీ డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని సారా వెల్లడించిందట.

మరోవైపు సుశాంత్ తో కలిసి థాయిలాండ్ ట్రిప్ కి వెళ్లినట్టు సారా ఒప్పుకుంది. సుశాంత్ తో కలిసి కేదార్ నాథ్ సినిమాలో నటించానని, సుశాంత్ బ్రేక్ సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడని సారా భయటపెట్టడం గమనార్హం. ఇక ఈ కేసులో ఎన్సీబి అధికారులు విచారణను వేగవంతం చేసారు.

More Related Stories