English   

హైదరాబాద్ లో అడుగుపెట్టిన రకుల్..షూటింగ్లో పాల్గొంటుందా

Rakul preet singh
2020-09-29 08:33:57

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ పేరును భయట పెట్టడంతో ఎన్సీబీ అధికారులు ఆమెను విచారణకు ఆదేశించారు. అయితే మొదట రకుల్ తనకు ఎలాంటి నోటీసులునందలేదనటంతో అధికారులు సీరియస్ అయ్యారు. దాంతో రకుల్ గత శుక్రవారం ముంబై లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యింది. విచారణలో అధికారులు రకుల్ ని నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. అనేక కోణాల్లో రకుల్ ను అధికారులు ముప్పు తిప్పలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే రకుల్ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని..కానీ డ్రగ్స్ కు సంబంధించిన చాటింగ్ లో పాల్గొన్నానని పేర్కొన్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. 

అయితే ఎన్సీబీ విచారణ అనంతరం రెండ్రోజుల తరవాత రకుల్  హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు ఉదయం రకుల్ విమానాశ్రయం వద్ద కారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రకుల్ షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతుండగా మరికొందరు ముంబైలో జాతీయ మీడియా ఇబ్బంది పెట్టడంతోనే వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా రకుల్ డ్రగ్స్ కేసులో తన పేరు భయటపడటంతో క్రిష్ దర్శకత్వంలో వికారాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ షూటింగ్ మళ్ళీ కొనసాగే అవకాశముంది.

More Related Stories