English   

డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరు బ్యూటీలకు షాక్

Sanjana Galrani
2020-09-29 08:44:22

బాలీవుడ్ పరిశ్రమ తో పాటూ శాండిల్ వుడ్ పరిశ్రమలోనూ డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం కన్నడ టెలివిజన్ రంగాన్ని కూడా పట్టుకుంది. ఇప్పటికే బెంగుళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ లు సంజనా, రాగిణి లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇద్దరిపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో సంజన, రాగిణి ఇళ్లపై దాడి చేసి అధికారులు ఇంట్లో డ్రక్స్ కు సంబందించిన ఆనవాళ్లు గుర్తించారు. దాంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఇదే కేసులో టీవీ యాంకర్ అనుశ్రీ ని సైతం అధికారులు విచారించారు. కన్నడ పరిశ్రమలో మరికొందరు ప్రముఖులపై కూడా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు వారిని కూడా విచారించేందుకు సిద్ధమౌతున్నారు. ఇదిలా ఉండగా సంజన, రాగిణి లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసి బెయిల్ ను నిరాకరించింది.

More Related Stories