ఏపీ సీఎం జగన్ కు కమల్ కృతజ్ఞతలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు భారతరత్న ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోమవారం మోడీకి లేఖ కూడా రాశారు. బాలు సుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలని కొరినందుకు జగన్ కు నటుడు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. కమల్ ట్విట్టర్ లో జగన్ రాసిన లేఖను షేర్ చేశారు. మన సోదరుడు బాల సుబ్రహ్మణ్యం పట్ల మీరు చేసిన వినతి గౌరవమైంది, సరైనది. ఈ విషయంపై కేవలం తమిళనాడు ప్రజలే కాక యావత్ భారత దేశంలోని బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు. అని కమల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా బాలు తెలుగుతో పాటు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశ వ్యాప్తంగా ఆయన గానం తో అభిమానులను సంపాదించుకున్నారు. కాగా బాలసుబ్రమణ్యం కారోనా బారిన పడటంతో చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో 40 రోజులవరకు చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల డాక్టర్లు, తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దాంతో ఆయన కరోనాను జయించారు. ఇక ఆయన కోలుకుని మళ్ళీ పాటలు పడతారు అనుకుంటే కరోనాను జయించినప్పటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణాన్ని సంగీత ప్రపంచం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది.