English   

క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన ముమైత్ ఖాన్

Mumaith Khan.jpg
2020-09-29 21:55:38

నటి, ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ హైదరాబాద్ కి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం...హైదరాబాద్ కి చెందిన క్యాబ్ డ్రైవర్ రాఘవ రాజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ముమైత్ హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి 4 రోజులు కారు అద్దెకు మాట్లాడుకుందని పేర్కొన్నాడు. అయితే గోవా వెళ్ళాక అక్కడే ఏడు రోజులు తన కారును తిప్పుతూ గడిపిందన్నాడు.

అంతే కాకుండా తన ఫుడ్డు బెడ్డు గురించి కూడా ముమైత్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్లో డీజిల్ కూడా తన డబ్బులతోనే కొట్టించానని రాఘవ తెలిపాడు. ఖర్చు చేసిన డబ్బులన్నీ ముమైత్ చివరకు ఇస్తుందేమో అనుకున్నా అని చెప్పాడు. కానీ ఇప్పుడు ముమైత్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. తనకు ముమైత్ మొత్తం 15వేల రూపాయలు ఇవ్వాలని కానీ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పాడు. తనకు 15వేల రూపాయలు ముమైత్ నుండి ఇప్పించాలని పోలీసులను కోరాడు.

ఇదిలా ఉండగా ముమైత్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించింది. అంతే కాకుండా తెలుగు బిగ్ బాస్ లో సైతం ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ గా వచ్చి అలరించింది. ఇదిలా ఉండగా ముమైత్ క్యాబ్ డ్రైవర్ కి డబ్బులు ఎగ్గొటిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ పొట్టగొట్టడం ఏంటని నెటిజన్లు ముమైత్ పై మండిపడుతున్నారు.

More Related Stories