English   

షాకింగ్ ..అరెస్టయిన కన్నడ హీరోయిన్ల ఫోన్లో బ్లూఫిల్మ్స్

Ragini Dwivedi
2020-09-30 17:55:59

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అధికారులు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రాని లను అరెస్ట్ చేశారు. అయితే అధికారులు సంజన, రాగిణి ఫోన్ లను పరిశీలించగా షాకింగ్ విషయాలు భయటపడ్డాయి. ఫోన్ లో ఇతర హీరోయిన్ల ఫొటోలతో పాటు వీడియోలు ఉన్నాయని సీసీబీ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. దాంతో డ్రగ్స్ తో పాటు ఈ భామలు మరో దందా కూడా నడిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికోసం ఒక గ్రూప్ ను క్రేయేట్ చేసినట్టు ..డ్రగ్స్ వ్యవహారం భయటకు రాగానే ఆ గ్రూప్ ను డిలీట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హీరోయిన్లు సెక్స్ రాకెట్ నడిపించినట్టు అధికారులకు అనుమానం రావడంతో కేసుతో సంబంధం ఉన్న పలువురిని ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇక్క తాజాగా డ్రగ్స్ కేసులో ముఖ్రో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు నైజీరియన్ కూడా ఉన్నారు. వీరు గోవా, ముంబై నుండి డ్రగ్స్ తీసుకువచ్చి మంగుళూరు లో అమ్ముతున్నట్టు తేలింది. కస్టడీలో ఉన్న డాన్సర్ కిషోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో రాగిణి, సంజన డ్రగ్స్ వాడినట్టు రూఢిగా తేలిందని అధికారులు పేర్కొన్నారు.

More Related Stories