గవర్నర్ తో భేటి అయిన పాయల్..కారణం ఇదే

బాలీవుడ్ నటి పాయల్ గోష్ ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యరి ని కలిశారు. ఇటీవల పాయల్ గోష్ తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ బలవంతం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మహా గవర్నర్ తో భేటి అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ తో భేటి అయ్యిన పాయల్ తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు వై సెక్యూరిటీ భద్రత కల్పించాలని కోరింది. ఈ మేరకు పాయల్ ఒక లేఖ రాసి గవర్నర్ కు సమర్పించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
"గౌరవనీయులైన గవర్నర్ భగత్ సింగ్ కోష్యరి గారిని కలిశాను. ఆయనతో సమావేశం గొప్పగా జరిగింది. నన్ను ఆపేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, అభ్యంతరం చెప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నేను వేటికి ఆగకుండా వెళ్లిపోతాను "అంటూ పాయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ తో కలిసి దగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ భేటీలో పాయల్ తో పాటు ఆమె లాయర్ మరియు రాజ్యసభ ఎంపీ రాందాస్ అతవలే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సైతం ఇటీవల గవర్నర్ ను కలిసింది. ఇక తాజాగా పాయల్ కూడా కలవడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది.