English   

అందుకే విడాకులు తీసుకున్నా..మళ్ళీ పెళ్లి చేసుకుంటూ 

 Devi Nagavalli
2020-10-01 08:32:57

బిగ్ బాస్ హౌస్ లో గతవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా టివి9 యాంకర్ దేవిని హౌస్ నుండి ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమె ఎలిమినేట్ అవ్వడం అన్యాయం అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా తాజాగా హౌస్ నుండి బయటకు వచ్చిన దేవి ఓ ఛానల్ కు తన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో దేవి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బిగ్ బాస్ లో తాను మిగతా వాళ్ళలా పెయిర్ అవ్వలేనని అలా నటించలేనని తెలిపింది. అలా డ్రామా చేస్తేనే బయట చూసేవాళ్ళకి నచ్చుతుందేమో అని తెలిపింది. తను తనలా ఉన్నానని రియల్ గా ఉన్నానని పేర్కొంది. 

అంతే కాకుండా తన వివహబంధం గురించి కూడా దేవి భయట పెట్టింది. తనకు పెళ్లి అయ్యిందని తమ అత్తగారు అమెరికాలో ఉంటారని తెలిపింది. ఆరేళ్ళ కొడుకు కూడా ఉన్నదని వెల్లడించింది. తన భర్త మరియు అత్తగారు చాలా మంచివాళ్ళని పేర్కొంది. కానీ తనకు జాబ్ చేయడం ఇష్టమని అక్కడ సెటిల్ అయ్యినవాళ్లను ఇండియాకు రమ్మంటే బాగుండదని అందుకే మ్యుచవల్ ఒప్పందంతో విడాకులు తీసుకున్నా అని తెలిపింది. అందుకు తన భర్త కూడా అంగీరించారని పేర్కొంది. ఇప్పటికి కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పింది. అంతే కాకుండా తనను నిజంగా ఎవరైనా ప్రేమిస్తే పెళ్లి కూడా చెనుకుంటానని తెలిపింది. కానీ ఇప్పుడు తన కొడుకు చైతన్య ఆరేళ్ళ వాడు అయ్యాడని కొంచం ఆలోచించాల్సివస్తుందని తెలిపింది.

More Related Stories