English   

అల్లు వారి స్టూడియోస్ కి శంకుస్థాపన

 Allu family
2020-10-02 00:16:33

ప్రముఖ దివంగత నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన మనవడు అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ పేరుతో స్టూడియోస్ ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. సినిమాలు, సీరియల్ ల షూటింగ్ లను చిత్రించడానికి స్టూడియోను నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాగా అల్లు స్టూడియోస్ ప్రారంబోత్వవ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో పాటు, బాబీ,శిరీష్, అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. తన కుమారుల భాగస్వామ్యం తోనే స్టూడియోను నిర్మిస్తున్నట్టు అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సినిమాల్లో అల్లు రామలింగయ్య నటనకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశారు. ఇక ఇటీవల ఆహా పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పటు చేసి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా వరుస సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇక తమ అభిమాన అల్లు కుటుంబం కొత్తగా స్టూడియో నిర్మిస్తున్నామంటూ అనౌన్స్ చేయడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories