English   

నితిన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

 Nithin
2020-10-02 07:33:39

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకువస్తున్నాడు. ఇప్పటికే నితిన్ హీరోగా రంగ్ దే సినిమా చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అందాదున్ రీమేక్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా నితిన్ మరో టైటిల్ ను కన్ఫామ్ చేశారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రీ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ లో విడుదల చేసారు. ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. ఇక పోస్టర్ లో నితిన్ చేతులకు బేడీలు ఉన్నాయి. ఆయన ముందు చెస్ బోర్డ్ మరియు కంచె కనిస్తున్నాయి. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో నితిన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక చిత్ర ప్రీ లుక్ విడుదల చేసిన కొరటాల శివ తన అభిమాన దర్శకుడు చంద్రశేకర్ యేలేటి, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. భవ్య క్రియేషన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

More Related Stories