English   

షారుక్ కూతురిపై ట్రోల్స్..ఇలా స్పందించిన చిన్నది

 Suhana Ali Khan
2020-10-02 15:50:53

అందం అంటే కేవలం శరీరానికి సంబందించిందే అని..మనసుకు సంబంధం లేదని కొందరు భావిస్తారు. అంతే కాకుండా అందంగా లేరని ఇతరులపై కామెంట్లు చేస్తూ వాళ్ళ మనోభావాలను సైతం దెబ్బ తీస్తుంటారు. ఈ సమస్య సాధారణ ప్రజలకే కాకుండా సెలబ్రెటీలకు వారి పిల్లలకు సైతం ఎదురవుతుంది. తాజాగా అలాంటి సమస్యే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురుకు సైతం ఎదురవుతోంది. షారుక్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పోస్ట్ లు చేస్తుంది. అయితే ఆమె ఫోటోలకు కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. నువ్వు అందంగా ఉండవని డైరెక్ట్ గా ఆమెకు కామెంట్స్ చెయ్యడం మరి కొందరు ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. దాంతో సుహానా భావోద్వేగానికి గురయ్యింది. దాంతో ఆమె అలాంటి కామెంట్స్ కు చెక్ పెట్టడానికి స్పందించింది. 

ప్రస్తుతం మన సమాజంలో ఎన్నో సవాళ్ళను చూస్తున్నామని..వాటిలో ఇది కూడా ఒకటని పేర్కొంది. దీనిని మనం రూపు మపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఇది కేవలం తాను ఒక్కరే ఎదురుకొంటున్న సమస్య కాదని సమాజంలోని ఎంతో మంది దీని కారణంగా దీనివల్ల బాధపడుతున్నారని వెల్లడించింది. తాను అందంగా ఉండనని వస్తున్న కామెంట్లు తన దృష్టికి వచ్చాయని..తనకు 12 ఏళ్ళ వయస్సు ఉన్నప్పటి నుండే తనపై ట్రోల్స్ వస్తున్నాయని పేర్కొంది. కానీ తాను వాటిని చూసి బాధపడటం లేదంని సంతోషపడుతున్నానని పేర్కొంది. ఇదిలా ఉండగా సుహానా ఖాన్ తండ్రి షారుక్ ఖాన్ కూడా అందాన్ని పెంచే ఫెయిర్ నెస్ క్రీమ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించడం కూడా ఓ వైపు సుహానా పై ట్రోల్స్ రావడానికి కారణమని చెప్పవచ్చు. ఆయన అందానికి సంబందించిన ఫెయిర్ నెస్ క్రీమ్ లకు అంబాసిడర్ గా ఉండటం సుహానా అందం అంత ఇంపార్టెంట్ కాదనడం చాలా బాగోలేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

More Related Stories