English   

ప్రభాస్ ఆదిపురుష్ నుండి కీలక అప్డేట్

Adipurush
2020-10-03 07:49:47

మరాఠీ సినిమా "లోకమాన్య ఏక్ యుగ పురుష్" తో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న దర్శకుడు ఓం రౌత్ ఆ తరవాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో తానాజీ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఓం రౌత్ అదే జోరులో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తో కలిసి "ఆది పురుష్" అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమౌతున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడిగా..సైఫ్ లంకేశ్ గా నటించనున్నట్టు తెలుతోంది. ఈ సినిమా చిత్రీకరణకు 750కోట్ల పైగా బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంచుకోబోతున్నారని కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో సరసన ఎవరు నటించనున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించి వచ్చే నెల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో నటించబోయే హీరోయిన్ పేరును ముందుగానే ప్రకటిస్తారని తెలుతోంది. కాగా హీరోయిన్ పేరును ముందే ప్రకటిస్తారా లేదంటే ప్రభాస్ బర్త్ డే వచ్చేనెల 23న ప్రకటిస్తారా అన్నది చూడాలి.

More Related Stories