English   

జూనియర్ చియాన్ తో పిజ్జా డైరెక్టర్ సినిమా

Karthik Subbaraj
2020-10-03 08:02:47

ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధృవ్  తెలుగు సినిమా అర్జున్ రెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసాడు. తెలుగులో అర్జున్ రెడ్డి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసినప్పటికీ తమిళ్ రీమేక్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో జూనియర్ చియాన్ కి పెద్ద పేరు కూడా రాలేదు. ఇక ఇప్పుడు తాజాగా ధృవ్ నేరుగా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తో రెడీ అవుతున్నాడు. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ "పిజ్జా" ను తెరకెక్కించిన దర్శకుడు సుబ్బరాజు దర్శకత్వంలో ధృవ్ సినిమా చేయబోతున్నాడు. తమిళ,తెలుగు భాషల్లో సుబ్బరాజు సినిమా పిజ్జా సూపర్ హిట్ అవ్వడంతో ఇంద్రుస్ట్రీలో ఆయన మంచిపేరు సంపాదించుకున్నారు. దాంతో ఆయన ఎంకంగా సూపర్ స్టార్ రజినీ తో సైతం సినిమాను తెరకెక్కించాడు. 

ఇక్క ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు ధృవ్ తో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాలో విశేషం ఏమిటంటే విక్రమ్ హీరోగా నటిస్తుండగా ఆయన తనయుడు ధృవ్ చియాన్ కీ రోల్ లో కనిపంచనున్నారు. సుబ్బరాజు ఈ చిత్రాన్ని హిల్ వ్యాలీలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇక విక్రమ్ కెరీర్ లో 60వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కొడైకెనల్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. అంతే కాకుండా సినిమా గ్యాంగ్ స్టర్ మర్డర్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తండ్రి కొడుకులు ఒకే స్క్రీన్ పై కనిపించనున్నానరని విక్రమ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories