English   

చిరంజీవితో సినిమా..ఎస్వీ కృష్ణారెడ్డి క్లారిటీ

SV Krishna Reddy
2020-10-03 08:11:45

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ కిష్ణారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగా సైతం సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సమ్పదించుకున్నారు. అప్పట్లో హీరోలు ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో ఒక్క సినిమా తీసినా సరిపోతుంది అనుకునేవారంటే కృష్ణా రెడ్డి క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ కృష్ణ రెడ్డి మాత్రం నాగార్జున, బాలయ్య లాంటి అగ్ర హీరోలతోనే సినిమాలు తీసేవారు. అయితే చిరంజీవితో సినిమా తియ్యలనుకున్నప్పటికి అది మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా కృష్ణా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవితో ఓ సినిమా అనుకున్నప్పటికి ఆగిపోయిందని తెలిపారు. సినిమా ఆగిపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవని అన్నారు. 

అది అడ్వాన్స్ టెక్నాలజీతో ముడిపడిన సినిమా అని అన్నారు. ఆ సమయంలో సినిమా వొర్కౌట్ అవుతుందా లేదా అన్న ప్రశ్నతో సినిమాను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతే కాకుండా ఆ రోజుల్లో ఆగిపోయిన ఆ స్టోరీని ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో తీయడం చాలా ఈజీ అని వెల్లడించారు. మరో నెల రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా ఆగిపోవడంతో మెగాస్టార్ తో కృష్ణా రెడ్డి ఇప్పటివరకూ సినిమా తియ్యలేదు. ఒక కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేశానని ఆ సినిమాతో తిరిగి ప్రస్థానాన్ని మొదలు పెడతానని కృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇక కృష్ణా రెడ్డి అభిమానులు ఆయన ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Related Stories