English   

ఎనిమిది నెలల తర్వాత కెమెరా ముందుకు శర్వానంద్..

Sharwanand
2020-10-03 08:18:20

కరోనా వైరస్ అందరి జీవితాల్లో అనుకోని బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఉరుకులు పరుగుల మీద సాగుతున్న జీవితానికి సడన్ బ్రేక్ వేసింది ఈ వైరస్. ఇల్లు మొహం చూడడానికి ఎన్నో రోజులు పట్టే సినిమా వాళ్లను కూడా ఆరు నెలల పాటు ఇంటిపట్టునే కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇప్పటికీ భారతదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయినా కూడా తమ పనులు మానుకుని ఇంటి దగ్గర కూర్చోవడం సాధ్యం కాదు కదా అంటున్నారు చాలామంది. ఈ క్రమంలోనే సినిమా వాళ్ళు కూడా తమ పనులు మొదలు పెట్టారు. ఆరు నెలల కింద ఎక్కడ ఆపేశారో తిరిగి అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టారు. ఒక్కొక్కరుగా మళ్లీ మొహానికి మేకప్ చేసుకుంటున్నారు. 

ఇప్పటికే నాగార్జున, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు తమ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు శర్వానంద్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా దాదాపు ఎనిమిది నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈయన నటించిన శ్రీకారం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా రోజుల కింద మొదలైంది. ఇప్పటికే ఫైనల్ షెడ్యూల్ కు వచ్చేసింది. అయితే వైరస్ కారణంగా అప్పుడు ఆపేసిన షూటింగ్ మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టారు. చెన్నైలో ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు శర్వానంద్. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమల అక్కినేని కీలక పాత్రలో నటిస్తుంది. 

More Related Stories