English   

సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా...స్టోరీలైన్ ఇదే

Sukumar Vijay Devarakonda
2020-10-03 08:23:46

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరవాత విజయ్ కి ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. ఇక మాస్ అర్జున్ రెడ్డి లాంటి డిఫరెంట్ సినిమాతో హిట్ కొట్టి తరవాత గీత గోవిందం తో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయ్యారు. వరుస విజయాలు అందడంతో విజయ్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే విజయ్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పురిజగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైటర్ షూటింగ్ ను కూడా కొంత వరకు పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్నటికి నిన్న టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్నట్టు కన్ఫామ్ అయ్యింది. అయితే సినిమా కన్ఫామ్ చేసిన గంటల్లోనే కథ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్ రంగస్థలం హిట్ తరవాత తెలంగాణ సాయుధ పోరాటం పై ఓ సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా స్టోరీ లైన్ కూడా పూర్తి చేసుకున్నాడట. ఆ ఆతరువాత సుకుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పై మళ్లీ స్పందించలేదు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమా అనౌన్స్ చేయడంతో విజయ్ తెలంగాణ సాయుధపోరాట యోధుడుగా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

More Related Stories