English   

పలాస డైరెక్టర్ ను అభినందించిన బన్నీ

 Allu Arjun
2020-10-03 08:39:35

ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా పలాస. 1978 బాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా రాజకీయ కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో నటించిన నటి నటులు కొత్తవాళ్ళైనప్పటికి తమ నటనతో మెప్పించారు. ఇక ఇప్పటికే పలాస సినిమా బాగుందంటూ పలువురు ప్రముఖులు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రియాలిస్టిక్ సినిమా పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందించారు. మంచి సినిమా చేశారంటూ అభినందించారు మెచ్చుకున్నారు అల్లు అర్జున్. అంతే కాకుండా పలాస 1978 చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు ఒక మొక్కను కూడా బహూకరించారు అల్లు అర్జున్. మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.

More Related Stories