English   

నెపోటిజం పై రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్..వాళ్ళకే అవకాశాలు

Raj Tarun
2020-10-03 09:17:33

ఎలాంటి బ్యాగ్ రౌండ్ లేకుండా సినిమాలపై తనకున్న ప్యాషన్ తో షార్ట్ ఫిల్మ్ లో నటించి సినిమా ఆఫర్లు దక్కించుకున్న హీరో రాజ్ తరుణ్. మొదటి సినిమా ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తన నటనతో కట్టి పడేసే టాలెంట్ ఉండటంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. సుకుమార్ సమర్పణలో రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా కుమారి 21ఎఫ్ సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా హెబ్బా-రాజ్ తరుణ్ కలిసి మరో సినిమా ఒరేయ్ బుజ్జిగాలో నటించారు. తాజాగా థియేటర్లు ఇంకా తెరవాపోవడంతో ఆ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదల చేసారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మొదటి సినిమా అనేది తనకు ఒక అనుభూతి అని అందుకే షార్ట్ ఫిల్మ్ లో నటించానని అన్నారు. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు సినిమా ఛాన్స్ రావడంతో ఒకే చెప్పానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి కారణంగా తనకు ఎక్కడా ఛాన్సులు రాకుండా పోలేదని తెలిపారు. టాలెంట్ ఉన్నవాళ్లను ఇండస్ట్రీలో తప్పకుండా ఆఫర్లు వస్తాయని పేర్కొన్నారు. తనకు ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఉండేదని మంచి స్టోరీలు కూడా రసుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు అలంటి ఆలోచనలు లేవని కేవలం నటనపైనే దృష్టి పెట్టానని పేర్కొన్నారు. ఒరేయ్ బుజ్జి సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ తో తనకు మంచి స్నేహం ఉందని  అతడితోనే మరో సినిమా చేస్తున్నానని వెల్లడించారు. షూటింగ్ సమయంలో విజయ్ టాలెంట్ ఏంటో తెలిసిందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

More Related Stories