English   

సూర్య సినిమాకు సత్యదేవ్ వాయిస్

Satyadev
2020-10-03 13:31:49

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అన్ని భాష చిత్రాలకు సూపరిచితుడైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో డబ్బింగ్ అయ్యిన సూర్య చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెవెంత్ సెన్స్, గజిని సినిమాలు సూర్య ను సౌత్ ఇండియా స్టార్ గా తీర్చి దిద్దాయి. మరోవైపు తెలుగులో సూర్యకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు సూర్య ఆకాశమే హద్దురా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధా కొందర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అపర్ణ బాల మురళి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తెలుగు వర్షన్ లో సూర్య వాయిస్ కు తెలుగు హీరో సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు సూర్య పాత్రకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఇక ఇప్పుడు మరి సూర్య కు సత్యదేవ్ ఇచ్చిన వాయిస్ కు కనెక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి.

More Related Stories