English   

కాజల్ అక్కడ కూడా దుకాణం ఓపెన్ చేసింది తెలుసా..

Kajal Aggarwal
2020-10-04 12:31:24

30 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరస సినిమాలతో రచ్చ చేస్తుంది కాజల్ అగర్వాల్. ఈమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. సినిమాకు కోటికి పైగానే పారితోషికం అందుకుంటూ తన సత్తా చూపిస్తుంది చందమామ. ప్రస్తుతం కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటిస్తూ బిజీగా ఉంది కాజల్. గతేడాది శర్వానంద్ రణరంగం.. బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో నటించింది. మరోవైపు తమిళనాట కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ప్రతీ సినిమాలో భారీగానే అందాలను ఆరబోసింది కాజల్. సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మధ్య హీరోయిన్లు చాలామంది డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు చందమామ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈమె వెబ్ సిరీస్ వైపు ఫోకస్ చేస్తుంది. 

తమిళనాట తనదైన సినిమాలతో సంచలనాలు సృష్టించే దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పుడు వెబ్ సిరీస్ పై మనసు పెడుతున్నాడు. ఈయనే నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ప్రభు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికోసం భారీగానే ఆమెకు పారితోషికం ఇస్తున్నాడు వెంకట్. కాజల్ కూడా తక్కువ సమయం.. ఎక్కువ డబ్బు వస్తుండటంతో కాదనలేకపోతుంది. పైగా ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దానివల్ల పోయే ఇమేజ్ కూడా ఏం లేదు. ఇంకా పెరుగుతుంది తప్ప.. తగ్గదు. అందుకే కొత్త అడుగు వేయడానికి సిద్ధమైపోయింది ఈ చందమామ. దాంతోపాటు హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా కు బాగా క్రేజ్ తీసుకొచ్చిన క్వాంటికో ఇండియన్ వెర్షన్ లో కూడా కాజల్ నటిస్తుంది. ఈ రెండూ తన కెరీర్ కు మరింత హెల్ప్ అవుతాయని చందమామ భావిస్తోంది. ఇప్పటికే కియరా అద్వానీ, నిత్యా మీనన్ సహా చాలా మంది హీరోయిన్లు వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. సమంత కూడా ఈ మధ్యే ఫ్యామిలీ మెన్ 2లో నటించింది.

More Related Stories