English   

ప్రభుత్వం రాయితీ ఇస్తేనే థియేటర్ల మనుగడ

Movie theater
2020-10-04 12:43:38

కరోనా లాక్ డౌన్ తో గత ఆరు నెలలు గా సినిమా థియేటర్లు మూతబడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో థియేటర్లకు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా థియేటర్లు మూసి ఉండటంతో తీవ్రంగా నష్టపోయామని థియేటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి అదుకుంటేనే మళ్ళీ థియేటర్లు నిలదొక్కుకునే పరిస్థితి ఉందన్నారు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ థియేటర్లకు అనుమతిచ్చారని అన్నారు. సినిమా థియేటర్లు ఎక్కువ కరెంట్ బిల్లుల కారణంగా నష్టపోతున్నాయని అన్నారు. ప్రేక్షకులు ఎవరు టికెట్ ను తాకకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా బ్రేక్ సమయంలో ప్రేక్షకులు గుమిగూడకుండా జాగ్రత్త పడతామని, ప్రేక్షకులకు శానిటైజర్ లు అందులో బాటులో ఉంచుతామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపరని కనీసం సీట్లు సగం నిండినా సంతోషమేనని పేర్కొన్నారు.

More Related Stories