లేటు వయసులో ప్రగతి హాట్ స్టెప్పులు

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఏ పాత్రలో అయినా ఒదిగిపోతుందన్న సంగతి తెలిసిందే. హీరోకు తల్లి పాత్ర ఇచ్చినా..లేదంటే ఏదైనా కామెడీ పండించే పాత్ర అయినా ప్రగతి ఆ పాత్రకు న్యాయం చేస్తుంది. అయితే ప్రగతిలో మరో టాలెంట్ కూడా దాగుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తన టాలెంట్ ను మెల్లమెల్లగా భయటకు తెస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. గత కొంతకాలంగా ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రగతి డ్యాన్సులను సైతం ఇరగదీస్తుంది. ఇక ప్రగతి వయ్యారాలు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. ఇటీవల జిమ్ లో ప్రగతి వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. హిందీ పాట సీటిమార్ కు ప్రగతి వేసిన స్టెప్పులు చూసి కుర్రకారు సీటీ కొడుతున్నారు. అంతే కాకుండా ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక మరికొందరైతే ఈ వయసులోనే ప్రగతి ఇలా ఇరగదీస్తుందంటే ఒకప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండేవారో అని అనుకుంటున్నారు.ఇదిలా ఉండగా ప్రగతి ప్రస్తుతం పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.