English   

బ్రేకింగ్..కరోనా తో ఆస్పత్రిలో చేరిన తమన్నా

 Tamannaah Bhatia
2020-10-04 13:47:55

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. ఇక సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కొంతమంది కొలుకోగా మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. కాగా తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా కరోనా బారిన పడింది. ఇటీవల ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్ రాగా తమన్నా కూడా టెస్ట్ చేయించుకున్నారు. అయితే అప్పుడు తమ్మన్నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక తాజాగా తమన్నా మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తమన్నా తో పాటు ఆమె సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తమన్నా కరోనా బారిన పడటంతో ఆమె అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు మొదలుపెట్టారు.

More Related Stories